తెలంగాణ

telangana

human trafficking

ETV Bharat / videos

Prathidwani : చిన్నారుల అదృశ్యాలకు అంతెక్కడ? - Human trafficking in Hyderabad

By

Published : Jun 21, 2023, 10:31 PM IST

Prathidwani : మానవ అక్రమరవాణా..! ఇదో దారుణ సమస్య. అక్రమ సంపాదన కోసం అరాచక ముఠాలు ఎంతకైనా తెగిస్తున్నాయి. అభంశుభం తెలియని చిన్నారులను విశృంఖలంగా తరలిస్తున్నాయి. నేడు మానవ అక్రమ రవాణా అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సమస్యగా మారింది. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని గతంలోనే కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఏటా సుమారు 1200 చిన్నారులు అదృశ్యం అవుతున్నారు. కొందరి ఆచూకీ తెలుస్తున్నా.. మిగిలిన వారి జాడ మాయం అవుతోంది. ఏళ్లు గడుస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. 

రాష్ట్రంలో చైల్డ్‌ హోమ్‌లు అన్ని ఎన్జీవోల నిర్వహణలోనే ఉన్నాయి. చైల్డ్‌హోంలలో కనీస సౌకర్యాలు లేని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం తరఫున ఒక్కటీ లేదన్న న్యాయ సేవాధికార సంస్థ.. సమస్యను చక్కదిద్దడానికి తక్షణం చేపట్టాల్సిన చర్యలు ఏమిటి?  ఇంత తీవ్రమైన ఈ సమస్య నియంత్రణకు రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రత్యేక విభాగమే లేదు. మానవ అక్రమ రవాణా విషయంలో.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితేంటి? ఈ విషయంలో ప్రస్తుతం హైకోర్టు ముందున్న కేసేంటి? ప్రభుత్వం, బాలల సంరక్షణ సంస్థలు ఏం చేస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందనే అంశాలపై నేటి ప్రతిధ్వని

ABOUT THE AUTHOR

...view details