తెలంగాణ

telangana

stage collapse in congress save democracy torch rally chhattisgar

ETV Bharat / videos

కూలిన వేదిక.. కింద పడిపోయిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు - stage collapsed chhattisgarh congress torch rally

By

Published : Apr 3, 2023, 1:00 PM IST

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ లోక్​సభ్​ సభ్వత్వం రద్దు చేయడంపై.. ఛత్తీస్​గఢ్​లో నిర్వహించిన నిరసనలో ప్రమాదం జరిగింది. అనర్హత వేటుకు వ్యతిరేకంగా బిలాస్​పుర్​లో కాంగ్రెస్​​ చేపట్టిన టార్చ్​ ర్యాలీలో వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్​ మార్కంతో పాటు రాష్ట్ర ఇంఛార్జ్​ చందన్​ యాదవ్, ఎమ్మెల్యే శైలేశ్​ పాండే, జిల్లా అధ్యక్షుడు కేసార్​వాణి కింద పడిపోయారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. అయితే, ఈ ప్రమాదంలో పలువురు నేతలు గాయపడినట్లు సమాచారం.  

బిలాస్​పుర్​లో 'సేవ్​ డెమొక్రసీ టార్చ్​ ర్యాలీ' పేరుతో కాంగ్రెస్ పార్టీ ఓ కార్యక్రమం నిర్వహించింది. అందులో భాగంగా.. గాంధీ చౌరస్తా నుంచి దేవకి నందన్​ చౌరస్తా వరకు చార్చ్​ ర్యాలీ చేపట్టింది. అనంతరం దేవకీ నందక్​ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేదిక పైకి నేతలు ఎక్కారు. వారితో పాటు సామర్థ్యానికి మంచి పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కారు. కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్​ మార్కం ప్రసంగిస్తుండగా స్టేజ్​ ఒక్కసారిగా కూలిపోయింది. 

ABOUT THE AUTHOR

...view details