'100 సినిమాలకు కష్టపడితే ఆ ఛాన్స్ వచ్చింది.. ఆయన వల్లే ఇదంతా' - ss thaman news
టాలీవుడ్ మోస్ట్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్‌ను జాతీయ అవార్డు వరించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'అల..వైకుంఠపురములో' చిత్రానికి అందించిన సంగీతానికి గానూ తమన్.. జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సినిమాలోని ఒక్కో పాట.. మాస్టర్ పీస్ అనే చెప్పాలి. అయితే తమన్‌కు ఈ సినిమా అవకాశం ఊరికే రాలేదు. త్రివిక్రమ్‌తో పనిచేసేందుకు చాలా ఏళ్లపాటు ఎదురుచూసిన తమన్‌కు.. తన 100వ సినిమాకు గానీ ఆ అవకాశం రాలేదట. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరాదా' కార్యక్రమానికి హాజరైన సందర్భంలో 'అల..వైకుంఠపురములో' సినిమాతో పాటు త్రివిక్రమ్‌తో ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చాడు తమన్. రామ్‌చరణ్‌తో డైరెక్టర్ శంకర్ తీస్తున్న సినిమా అవకాశం తనకు రావడానికి కూడా 'అల..వైకుంఠపురములో' మూవీనే కారణమని చెప్పాడు తమన్. అదెలాగో తెలుసుకోండి.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST