Bharatanatyam : శిల్పకళా వేదికలో శృతి, దివ్య భరతనాట్య అరంగేట్రం - hyderabad latest news
Sruthi Addala and Divya Addala Bharatanatyam Arangetram : హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళా వేదిక జయ కళాకేంద్ర ఆధ్వర్యంలో శృతిఅడ్డాల, దివ్య అడ్డాల భరతనాట్య అరంగేట్రం సమ్మోహనంగా సాగింది. అమెరికాలో ఉంటున్న ప్రవాసీయులు అడ్డాల వెంకట కృష్ణరాజు, పద్మజ దంపతుల కుమార్తెలు అయిన శృతి అడ్డాల, దివ్య అడ్డాల అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ మాతృదేశంపట్ల.. భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై మక్కువతో.. తల్లిదండ్రులపై ఉన్న మమకారంతో ఆరవ ఏట నుంచే భరతనాట్యం, కర్ణాటక సంగీతంలో శిక్షణను తీసుకున్నారు. ప్రముఖ భరతనాట్య గురువులు సుగంధ శ్రీనాధ్, శ్రేయ అయ్యర్ పార్కర్ ఆధ్వర్యంలో వీరిద్దరు భరత నాట్యంలో శిక్షణ పొందారు. అలాగే శ్రీలక్ష్మి కోలవెన్ను దగ్గర సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో కుటుంబ సభ్యుల మధ్య జరిగిన అరంగేట్ర కార్యక్రమంలో తమ నృత్య అభినయంతో అలరించారు. గణపతి స్థితితో నాట్యం ప్రారంభమై మాలారి, అలరింపు, జతస్థర్వం, కీర్తనతో సందర్శకులను మంత్రముగ్దునులను చేశారు. వారు చేసిన నృత్యాలను చూసి పలువురు అభినందనలు తెలిపారు.