SRSP water levels today : ఎస్సారెస్పీకి నిలకడగా కొనసాగుతున్న వరద - Telangana Irrigation Projects
Sriram sagar project water level today : ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ జలకళను సంతరించుకుంది. ఇటీవల కురిసిన వర్షాలతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్ట్‌కు కాస్త వరద ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 108,000 క్యూసెక్కుల వరద వస్తోంది. 26 వరద గేట్లను ఎత్తి.. 1,00,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 8000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వ 1091 అడుగులకు.. ప్రస్తుతం 1089.7 అడుగుల నీరు ఉంది. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు గాను.. 83 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్ట్‌కు నిలకడగా వరద వస్తుండడంతో దిగువకు.. నీటి విడుదల కొనసాగుతుందని తెలిపారు. శ్రీరాంసాగర్ దిగువన నివసిస్తున్న గ్రాామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోత్తట్టు ప్రాంతాలో ఉంటున్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పేర్కొన్నారు.