SRSP Water Level Today : ఎస్సారెస్పీకి జలకళ.. 27.738 టీఎంసీల ప్రస్తుత నీటినిల్వ
SRSP Water Level Today : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంటోంది. ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరద, పునరుజ్జీన పథకంతో వస్తున్న నీటితో కళకళలాడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 30438 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఎగువ గోదావరి నుంచి 26088 క్యూసెక్కులు, శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం రివర్స్ పంపింగ్ ద్వారా 4350 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1069.40 అడుగుల వద్ద.. 27.738 టీఎంసీల నీటినిల్వ ఉంది. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నిల్వసామర్ధ్యం 90 టీఎంసీలతో.. 42 గేట్లున్నాయి.
వర్షాభావ పరిస్థితుల్లో శ్రీరాంసాగర్‌కు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీటిని తరలించేందుకు శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం నుంచి గోదావరి నీటిని వెనక్కి తీసుకువచ్చి.. వరద కాలువ ద్వారా నీటిని శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు మళ్లిస్తున్నారు. ఎస్సారెస్పీ వరద కాల్వపై మూడు పంపుహౌజ్‌లు నిర్మించారు. వరద కాలువ 73 కిలోమీటర్ల వద్ద రాంపూర్, 34 కిలోమీటర్ల వద్ద రాజేశ్వర్రావు పేట, 0.1 కిలోమీటర్ల వద్ద ముప్కాల్ పంపుహౌజ్‌లు నిర్మించf.. ఒక్కో పంపుహౌజ్‌లో 6.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఎనిమిది చొప్పున మోటార్లు బిగించారు.