Sriram Sagar Project gates Opened : ఎస్సారెస్పీకి భారీ వరద.. 21 గేట్లు ఎత్తి నీటి విడుదల
Published : Sep 6, 2023, 10:20 AM IST
Sriram Sagar Project gates Opened : రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 89వేల 94 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. 21 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 3వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 5వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత, పూర్తిస్థాయి నీటి నిల్వ 1091 అడుగులుగా ఉంది. నీటినిల్వ ప్రస్తుతం, పూర్తిస్థాయి సామర్థ్యం 90.3 టీఎంసీలుగా ఉంది.
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతుంది. ప్రాజెక్టులోకి 46 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఆరు గేట్లు ఎత్తి 46 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. కాగా నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1404.5 అడుగులుగా ఉంది. పూర్తి నీటినిల్వ 17.8 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 17 టీఎంసీల నీరు నిల్వ ఉంది.