భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు - పరశురామ అవతారంలో రామయ్య దర్శనం - Parasurama Avataram
Published : Dec 18, 2023, 1:50 PM IST
Sri Sitaramachandra Swamy in Parasurama Avatharam : భద్రాద్రి రామయ్య సన్నిధిలో జరుగుతున్న శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. నేడు స్వామివారు పరశురామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన ఆలయంలోని స్వామివారిని బేడా మండపం వద్దకు తీసుకువచ్చి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం స్వామి వారు సకల రాజ లాంఛనాల నడుమ పట్టణ పురవీధుల్లో విహరించారు. పరశురామ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని, సకల సుఖాలు కలుగుతాయని ఆలయ వేద పండితులు కృష్ణమాచార్యులు తెలిపారు.
Bhadrachalam Mukkoti Utsavalu 2023 : అవతార దర్శనాల అనంతరం ఈ నెల 22న గోదావరిలో సీతారాములకు తెప్పోత్సవ వేడుక జరగనుంది. ఈ నెల 23న వైకుంఠ ఏకాదశి రోజు లక్ష్మణ సమేత సీతారాములు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రతిరోజు వివిధ అవతారాల్లో దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో ఉంచిన అధికారులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.