ప్యాలెస్ జిమ్‌లో కసరత్తులు.. సోఫాలో చిల్.. పూల్‌లో ఈత.. నిరసనకారుల సంబరాలు! - అధ్యక్ష భవనంలో శ్రీలంక నిరసనకారులు
శ్రీలంకలో నిరసనకారులు అధ్యక్షుడి భవనంలోకి చొచ్చుకెళ్లి రచ్చరచ్చ చేశారు. భవనంలోని స్విమ్మింగ్ పూల్‌లో కొంతమంది ఈత కొట్టగా.. మరికొందరు అక్కడి జిమ్‌లో కసరత్తులు చేశారు. ఇంతటి ఆందోళనల్లోనూ కొందరు సరదాగా.. పిక్నిక్ చేసుకున్నారు. చిన్నారులు, కుటుంబ సభ్యులను వెంటబెట్టుకొని ప్రెసిడెంట్ ప్యాలెస్‌కు చేరుకున్న నిరసనకారులు.. విందు భోజనం చేశారు. సోఫాల్లో ప్రశాంతంగా సేదతీరారు. భవనంలో తిరుగుతూ సెల్ఫీలు దిగారు. అవినీతి నుంచి ఇప్పుడు విముక్తి లభించిందని, అందుకే సంబరాలు చేసుకుంటున్నామని నిరసనకారులు చెప్పారు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST