Sports Expo at HITEX Exhibition Center in Madapur : మాదాపూర్ ఎగ్జిబిషన్ సెంటర్లో స్పోర్ట్స్ ఎక్స్ పో ప్రదర్శన - hyderabad latest news
Published : Aug 25, 2023, 6:47 PM IST
Sports Expo at HITEX Exhibition Center in Madapur : హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో స్పోర్ట్స్ ఎక్స్ పో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నటుడు మంచు విష్ణు ముఖ్య అతిథిగా హాజరై.. ప్రదర్శనను ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ఫిట్నెస్కు సంబంధించిన అన్ని రకాల పరికరాలు, ఆర్గానిక్ ఆహార పదార్థాలు, క్రీడాకారులు ఉపయోగించే స్పోర్ట్స్ వస్తువులు ప్రదర్శనకు ఉంచారు. అంతేకాకుండా సహజ యోగా వారి ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ ఎక్స్ పో నిర్వాహకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. వ్యాయామం కోసం అవసరమైన పరికరాలు క్రీడాకారులకు ఉపయోగపడే షూ, వస్తువులు, దుస్తులు క్రీడల్లో ఉపయోగించే పరికరాలు అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం సహజ యోగా నిర్వాహకులు మాట్లాడుతూ.. యోగా ఆధ్వర్యంలో మానసిక ప్రశాంతత కోసం సంగీతం తోడ్పాటు అందిస్తుందని వివరించారు. దీనికోసం సంగీత కచేరి, యోగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక్కడ మానసిక ఉల్లాసానికి సంబంధించిన అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నగర వాసులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.