Telangana Devotional Day 2023 : 'తెలంగాణ పండుగల ప్రాధాన్యత విశ్వవ్యాప్తమైంది'
Spiritual day in Telangana : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు, హోమాధి కార్యక్రమాలు చేశారు. చండీ హోమం, రుద్ర హోమం, పూర్ణాహుతి, వేద పారాయణం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాలయాలను అభివృద్ధి పరచడంతో పాటు పండుగలకు ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి తలసాని అన్నారు. తెలంగాణలోని ఆలయాల విశిష్టత.. పండుగల ప్రాధాన్యత విశ్వవ్యాప్తమైందని తెలిపారు. ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా మసీదు, చర్చిల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సెక్యులర్ విధానాలతో సర్వమత సౌబ్రాతృత్వాన్ని చాటే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఘనంగా వైభవంగా నిర్వహించామన్నారు. రేపటి నుంచి గోల్కొండలో బోనాల ఉత్సవాలు ప్రారంభం అవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.