తెలంగాణ

telangana

Special Pooja for Chandrababu at Chilkur

ETV Bharat / videos

Special Pooja for Chandrababu at Chilkur : చంద్రబాబు బయటకు రావాలని చిలుకూరులో టీడీపీ కార్యకర్తల ప్రత్యేక పూజలు - చిలుకూరు బాలాజీ టెంపుల్​లో చంద్రబాబు కోసం పూజలు

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2023, 1:22 PM IST

Special Pooja for Chandrababu at Chilkur : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కావాలని కోరుకుంటూ ..  రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో టీడీపీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చిన తొలుత  ప్రదక్షిణలు చేసి.. తమ నాయకుడు వెంటనే విడుదల కావాలని కోరుకున్నారు. అనంతరం గరుడ కవచ స్తోత్ర పారాయణం చేశారు. చిలుకూరు బాలాజీకి అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదంతో చంద్రబాబుకు వెంటనే బెయిల్ రావాలని ప్రార్థించారు. ఈ క్రమంలో చిలుకూరు బాలాజీ ఆలయానికి టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

Protests Against Chandrababu Arrest Telangana :  నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్​కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశ, విదేశాల్లో  తమ ప్రియతమ నాయకుడి అరెస్టు​ను వ్యతిరేకిస్తూ ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. కొవ్వొత్తుల ర్యాలీలు, మోత మోగిద్దాం వంటి సామూహిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా పలు విధాలుగా చంద్రబాబుపై పెట్టిన అక్రమ ఆరోపణలను ప్రజలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details