వికలాంగుల ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ప్రత్యేక ఏర్పాట్లు : శైలజ - telangana election poling
Published : Nov 30, 2023, 7:26 AM IST
Special Arrangements For Vote Of Disabled Persons: రాష్ట్రంలోని వికలాంగుల ఓటు శాతం పెంచడమే లక్ష్యంగా.. ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ శైలజ తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట్ర వికలాంగుల సంక్షేమశాఖ కార్యాలయంలో మాట్లాడిన ఆమె.. చెవి, మూగ, వృద్ధులతో పాటు దృష్టిలోపం ఉన్న వారికి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడించారు.
దృష్టిలోపం ఉన్న ఓటర్లకు ప్రత్యేకంగా బ్రైయిలీ లిపి స్లిప్ ముద్రించి సరఫరా చేశామన్నారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద నోడల్ అధికారితో పాటు వాలెంటీర్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. సాధ్యమైనంత వరకు గ్రౌండ్ ప్లోర్లోనే పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ఉచిత రవాణాతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. వికలాంగులతో బూత్ వద్ద ఎలా వ్యవహరించాలి అనే విషయాలపై వాలంటీర్లకు శిక్షణ కల్పించినట్లు తెలిపారు. నేడు జరిగే ఎన్నికల్లో అందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.