తెలంగాణ

telangana

Kanpur SP Murthy

ETV Bharat / videos

Kanpur Municipal Elections : కాన్పూర్​లో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్​ ఎన్నికలు - Kanpur Municipal Elections 2023

By

Published : May 12, 2023, 12:23 PM IST

Kanpur Municipal Elections 2023 : ఉత్తరప్రదేశ్​లోని కాన్పూర్​ జిల్లాలో మున్సిపల్​ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు అక్కడ విధులు నిర్వర్తించిన ఎస్పీ మూర్తి తెలిపారు. ప్రజలంతా స్వేచ్చాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని మొత్తం 13 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరినట్లు వెల్లడించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని ఎస్పీ వివరించారు. ఓటర్లు కూడా అధిక సంఖ్యలో పోలింగ్​ స్టేషన్​ల వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించిన అక్కడి జిల్లా ప్రజలకు, ఎన్నికల అధికారులు, పోలీసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

"ఉత్తరప్రదేశ్​లో కాన్పూర్​ దేహాత్​ జిల్లాలో మున్సిపల్​ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 13 నియోజక వర్గాల్లో ఈ ఎన్నికలు జరగగా ప్రజలు ప్రజలందరూ అధిక సంఖ్యలో వచ్చి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందుకు సహకరించిన ప్రజలు, అధికారులకు ప్రత్యేక అభినందనలు".- మూర్తి, ఎస్పీ, కాన్పూర్​ దేహాత్​

ABOUT THE AUTHOR

...view details