దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చుకుందాం : సోనియా గాంధీ - తెలంగాణ ఎన్నికల్లో సోనియా గాంధీ
Published : Nov 28, 2023, 3:35 PM IST
Sonia Gandhi Message to Telangana People: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరింది. దిల్లీ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వరుస పర్యటనలతో హోరెత్తించారు. అయితే కాంగ్రెస్ అగ్ర నాయకులు ఎంతమంది ప్రచారం చేసినా.. సోనియా గాంధీ(Sonia Gandhi) రాలేదన్న చిన్న లోటు కనిపించింది. కానీ ఇవాళ ప్రచారం చివరిరోజు ఆమె రాష్ట్ర ప్రజలకు ఆమె సందేశాన్ని(Sonia Gandhi Message ) ట్విటర్ ద్వారా తెలియజేశారు.
Sonia Gandhi Speech about Telangana Elections: తాను అనారోగ్య పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ప్రచారానికి రాలేకపోతున్నానని.. కానీ తెలంగాణవాసులు తన హృదయానికి చాలా దగ్గరకు ఉన్నారని తన సందేశంలో తెలిపారు. సోనియమ్మ అంటూ తనపై ఎంతో ప్రేమ చూపారని హర్షం వ్యక్తం చేశారు. మీ ప్రేమ, అభిమానాలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. కాంగ్రెస్ను గెలిపించి.. దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చుకుందామని అన్నారు. రాష్ట్ర ప్రజల స్వప్నాలు సాకారం కావాలని.. మార్పు కోసం హస్తం గుర్తుకే ఓటు వేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చేసిన నినాదమైన..'మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి' అని తన సందేశంలో వివరించారు.