ఆస్తి కోసం సొంత మామపై కత్తితో దాడి.. 20 సార్లు పొడిచి మరీ హత్య - ఆస్తి కోసం సొంత మామను హత్య చేసిన అల్లుడు
కర్ణాటకలో దారుణం జరిగింది. ఆస్తి కోసం సొంత మామను అతి కిరాతకంగా హత్య చేశాడో యువకుడు. ఈ ఘటన హుబ్బళ్లి ప్రాంతంలో గురువారం రాత్రి జరిగింది. ఆస్తి విషయంలో శివప్ప అనే వ్యక్తికి, అతడి అల్లుడు గురప్పకు మధ్య వివాదం చెలరేగింది. దీంతో కోపోద్రికుడైన గురప్ప తన మామపై కత్తితో దాడి చేశాడు. స్థానికులు అడ్డుకునేలోపే కత్తితో దాదాపుగా 20 సార్లు పొడిచాడు. దీంతో శివప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే స్థానికులు గురప్పను అడ్డుకున్నారు. దీనిపై హుబ్బళ్లి రూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.