తెలంగాణ

telangana

ETV Bharat / videos

హిమాచల్ ప్రదేశ్​కు మంచు దుప్పటి.. టూరిస్టులు ఫుల్ ఖుష్ - himachal latest snowfall news

By

Published : Jan 11, 2023, 4:20 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

శీతాకాలం కావడం వల్ల హిమాచల్ ప్రదేశ్​లో భారీగా మంచువర్షం కురుస్తోంది. లాహౌల్ వ్యాలీ మొత్తం మంచు దుప్పటిని కప్పుకుంది. లాహౌల్​, కిన్నౌర్‌ ప్రాంతాలలో భారీగా మంచు వర్షం కురవడం వల్ల అక్కడి ప్రాంతమంతా శ్వేతవర్ణంలో దర్శనమిస్తోంది. బాగా మంచు కురవడం వల్ల చెట్లన్నీ తెల్లని పూలు పూసినట్లుగా కనిపిస్తున్నాయి. హిమాచల్​లో ఈ సీజన్​లో మొదటి మంచువర్షం ఇదే. దీనితో మంచుతో స్వర్గదామంలా దర్శనమిస్తున్న వ్యాలీ అందాలతో పర్యటకులు మైమరచిపోతున్నారు. హిమపాతం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details