తెలంగాణ

telangana

man gives water to snake

ETV Bharat / videos

'ఎలుకల మందు తిని పాముకు అస్వస్థత'.. బాటిల్​తో నీళ్లు తాగిస్తే.. - snake rescue video

By

Published : Jul 5, 2023, 7:09 PM IST

Man Gives Water To Snake : ఎలుకల మందు తిని అస్వస్థతతకు గురైన ఓ పాముకు వాటర్ బాటిల్​తో నీళ్లు పట్టి కాపాడాడు ఓ సామాజిక కార్యకర్త. ఈ తర్వాత ఆ పామును సురక్షిత ప్రదేశంలో వదిలేశాడు. ఈ ఘటన తమిళనాడు.. కడలూరు జిల్లాలోని తిరుచోపురంలో జరిగింది.  

ఇంతకీ ఏం జరిగిందంటే?  
Snake rescue video : తిరుచోపురం గ్రామానికి చెందిన నటరాజన్ అనే వ్యక్తి ఇంటి తలుపు వద్దకు ఓ పాము వచ్చింది. అది అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయేలా ఉంది. వెంటనే నటరాజన్​.. పాము సంరక్షకుడు, సామాజిక కార్యకర్త సెల్వకు సమాచారం అందించాడు. పామును ఎలాగైనా రక్షించాలని సెల్వను కోరాడు. ఘటనాస్థలికి చేరుకున్న సెల్వ.. పాముకు వాటర్​ బాటిల్​తో నీళ్లను అందించాడు. అప్పుడు.. మెల్లగా పాము కోలుకుంది. కాసేపటి తర్వాత సెల్వ.. పామును సురక్షిత ప్రదేశంలో వదిలిపెట్టాడు. దీంతో తిరుచోపురం గ్రామస్థులు.. సెల్వపై ప్రశంసలు కురిపించారు. 'ఇంట్లో ఎలుకలు మందు పాము తిని ఉండొచ్చు. అందుకే ఆ పాము తీవ్ర అస్వస్థతతకు గురైంది.' అని సెల్వ అన్నాడు. 

ABOUT THE AUTHOR

...view details