Snake Inside Helmet : హెల్మెట్‌లో దూరిన నాగుపాము.. బైక్ తీస్తుండగా సౌండ్ వస్తోందని చూస్తే షాక్ - snake found in helmet video
Published : Oct 5, 2023, 9:05 AM IST
Snake Inside Helmet in Kerala :రెండు నెలల వయసు ఉన్న ఓ నాగు పాము హెల్మెట్‌లోకి దూరింది. కేరళ త్రిస్సూర్‌లో ఈ ఘటన జరిగింది. పుతూర్‌లో నివాసం ఉండే పొంటెకాల్ సోజన్.. తన బైక్‌ను తాను పని చేసే చోట పార్క్ చేసి ఉంచాడు. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో బైక్‌ను తీసేందుకు ప్రయత్నించాడు. ముందుగా హెల్మెట్‌ను తనిఖీ చేశాడు. అందులో ఏదో కదులుతున్నట్లు అనిపించేసరికి సోజన్ అప్రమత్తమయ్యాడు. కాస్త పరిశీలించి చూస్తే అందులో చిన్న పాము కనిపించింది. అయితే, లక్కీగా అతడు పాము కాటుకు గురికాలేదు. సురక్షితంగా దాని నుంచి తప్పించుకున్నాడు. హెల్మెట్‌ను దూరంగా పెట్టి.. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ శాఖకు చెందిన ఓ వలంటీర్ లిజో.. ఘటనా స్థలికి చేరుకున్నాడు. హెల్మెట్‌ను తనిఖీ చేసిన లిజో.. అందులో పాము నక్కి ఉన్నట్లు గుర్తించాడు. పామును జాగ్రత్తగా బయటకు తీశాడు. అత్యంత విషపూరితమైన ఈ నాగు పాము వయసు రెండు నెలలు ఉంటుందని లిజో తెలిపాడు.