తెలంగాణ

telangana

Snake In Scooty In Tamil Nadu

ETV Bharat / videos

స్కూటీలో దూరిన ఏడు అడుగుల పాము- వర్షాలకు వచ్చి డూమ్​లో నక్కి! - తమిళనాడులో స్కూటీ ముందుభాగంలో దూరిన పాము

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 7:54 AM IST

Updated : Dec 12, 2023, 8:05 AM IST

Snake In Scooty In Tamil Nadu : ఏడు అడుగుల పొడవైన పాము ఓ స్కూటీలో ప్రత్యక్షమై తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది. పార్క్ చేసిన స్కూటీ ముందు భాగంలో దూరింది పాము. దీనిని గమనించిన యజమాని సహాయ సిబ్బందికి సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న సిబ్బంది తీవ్రంగా శ్రమించి పామును బయటకు తీసి కాపాడారు. ఆ తర్వాత పామును ఓ సంచిలో పెట్టుకుని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టారు. ఇటీవల వచ్చిన తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాల కారణంగా కొట్టుకునివచ్చి ఇలా స్కూటీలో దూరి ఉంటుందని సిబ్బంది భావిస్తున్నారు.  

స్కూటీలో దూరిన కొండచిలువ
గతంలోనూ ఇలాంటి ఘటనే ఛత్తీస్​గడ్​లోనూ జరిగింది. మనేంద్రగఢ్ భరత్​పుర్​ చిర్మిరి జిల్లాలో కొండచిలువ ఓ స్కూటీలోకి దూరి కలకలం సృష్టించింది. రెస్క్యూ బృందం చాలా సమయం శ్రమించి స్కూటీ భాగాలను విడదీసి కొండచిలువను బయటకు తీసింది. దానిని కారులో తీసుకెళ్లి అడవిలో వదిలేశారు. ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Last Updated : Dec 12, 2023, 8:05 AM IST

ABOUT THE AUTHOR

...view details