తెలంగాణ

telangana

SNAKE FAIR ON NAGPANCHAMI

ETV Bharat / videos

పాములను మెడలో చుట్టుకుని విన్యాసాలు.. వందల సర్పాలతో నాగపంచమి వేడుకలు

By

Published : Jul 8, 2023, 10:34 AM IST

బిహార్​లోని బెగూసరాయ్​లో నాగ పంచమి వేడుకలు వినూత్నంగా జరిగాయి. సాధారణంగా ఈ పండగ సమయంలో పాములకు పాలు పోసి నాగ దేవతను పూజిస్తారు. కానీ బెగూసరాయ్ జిల్లా మన్సూర్​చాక్​లోని ఆగా​పుర్ గ్రామస్థులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. పాములను చేతుల్లో పట్టుకని.. మెడకు చుట్టుకుని విన్యాసాలు చేశారు. ఈ ఆచారం అనేక ఏళ్లుగా కొనసాగుతోంది. 

తమ ఆచారం ప్రకారం గ్రామస్థులు సమీపంలో ఉన్న బాలన్ నదిలోకి దిగి వాటి నుంచి విష సర్పాలను చేతులతో పట్టుకుంటారు. అనంతరం ఆ పాములను మెడలో వేసుకుని ఊరేగింపుగా తీసుకువస్తారు. తర్వాత గుడికి తీసుకువెళ్లి పూజలు నిర్వహిస్తారు. "మాకు పాములు అంటే భయం లేదు. ఈ ఆచారం అనేక ఏళ్లుగా కొనసాగుతోంది. మా తాతలు, తండ్రులు.. బాలన్​ నదిలో దిగి పాములు పట్టుకునేవారు. ఇప్పుడు ఈ ఆచారాన్ని మేము కొనసాగిస్తున్నాం. నదిలో పాములను పట్టుకని ఊరేగింపుగా గుడికి వెళతాం" అని ఓ భక్తుడు తెలిపాడు.

విష సర్పాలను సైతం లెక్కచేయకుండా పాములతో విన్యాసాలు చేశారు గ్రామస్థులు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు గ్రామంలోని అందరూ.. పాములను ఎలాంటి భయం లేకుండా పట్టుకున్నారు. ఇన్నేళ్లుగా ఈ ఆచారం సాగుతున్నా.. పాముల వల్ల ఇప్పటి వరకు ఎలాంటి అపాయం జరగలేదని గ్రామస్థులు చెప్పారు. ఈ వేడుకలను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆసక్తి చూపుతుంటారు.

ABOUT THE AUTHOR

...view details