ఇంటి వెనుక 25 తాచు పాములు.. పడగలు విప్పి, బుసలు కొడుతూ..
కర్ణాటక, ధార్వాడ్ జిల్లాలోని ఓ ఇంటి పెరట్లో 25పైగా తాచు పాములు బయటపడ్డాయి. ఒకేచోట అన్ని పాముల్ని చూసిన స్థానికులు.. ఒక్కసారిగా హడలెత్తిపోయారు. ఆ పాములన్నింటినీ పట్టుకున్న స్నేక్ క్యాచర్.. అనంతరం వాటిని స్థానిక అడవుల్లో విడిచిపెట్టాడు.
కొంతకాలంగా ఇంటి పరిసరాల్లో సంచరిస్తున్న పాము..
బసవరాజ్ కట్టిమాని.. కుందగోళ నియోజకవర్గ పరిధిలోని హిరేహరకుని గ్రామానికి చెందిన వ్యక్తి. కొంత కాలంగా ఓ తాచు పాము బసవరాజ్ ఇంటి పరిసరాల్లో సంచరిస్తోంది. దీన్ని గమనించిన అతడు.. స్నేక్ క్యాచర్కు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్.. తాచు పామును పట్టుకున్నాడు. తరువాత దాన్ని పట్టుకున్న స్థలంలోనే.. స్థానికుల సాయంతో ఓ గొయ్యి తవ్వాడు. అనంతరం ఆ రంధ్రంలోంచి బుల్లి తాచు పాము పిల్లలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. పడగలు విప్పి, బుసలు కొడుతూ కనిపించాయి. వాటిని చూసిన స్థానికలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చాకచక్యంగా పాముల్ని పట్టుకున్న స్నేక్ క్యాచర్.. వాటిని ఓ డబ్బాలో భద్రపరిచాడు. అనంతరం జాగ్రత్తగా స్థానిక అడవిలో విడిచిపెట్టాడు. పాములను చంపవద్దని.. కనిపిస్తే తమకు సమాచారం అందిచాలని స్నేక్ క్యాచర్.. స్థానికులకు సూచించారు.
లక్కీ గర్ల్.. పాము కాటు నుంచి తృటిలో తప్పించుకున్న చిన్నారి..
కొద్ది రోజలు క్రితం కర్ణాటక బెళగావి జిల్లాలోని హలగా గ్రామంలో ఓ బాలిక అదృష్టవశాత్తు నాగుపాము కాటు నుంచి తప్పించుకుంది. ఇంటి గుమ్మం వద్ద బుసలు కొడుతూ ఉన్న ఓ పామును గమనించకుండా అలాగే ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. బాలిక తలుపు వద్దకు రాగానే పాము తలపైకి ఎత్తి ఆమెను కరిచేందుకు చూసింది. అయితే కొన్ని క్షణాలు గుమ్మం డోర్ దగ్గర నిలబడ్డ ఆ చిన్నారిని లోపల ఉన్న కుటుంబ సభ్యులు అప్రమత్తం చేయడం వల్ల ఆమె ఇంట్లోకి పరుగులు తీసింది. క్షణాల్లోనే ప్రాణాపాయం నుంచి బయటపడింది.వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి