రోడ్డు మధ్యలో నుంచి పొగ.. పక్కనే విద్యుత్ స్తంభం.. స్థానికుల భయాందోళన - రోడ్డులో నుంచి మంటలు
Smoke from road: ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో రోడ్డు మధ్యలో నుంచి దట్టమైన పొగ బయటకు వచ్చింది. రాజ్‌భవన్ వద్ద ఉన్న రోడ్డుపై ఉదయం 6 గంటలకు పొగ రావడం కనిపించింది. అటుగా వెళ్తున్నవారు పెద్ద ఎత్తున అక్కడకు వెళ్లి.. రహదారిని గమనించారు. సమాచారం అందుకొని వచ్చిన అగ్నిమాపక దళం.. నాలుగు గంటల పాటు కష్టపడి పొగను నియంత్రించారు. పొగ వల్ల స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పక్కనే విద్యుత్ స్తంభం ఉండటం వల్ల ఏం జరుగుతుందోనని భయపడ్డారు. ముందుజాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేసిన అధికారులు.. రెండు అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించారు. అయితే, పొగ రావడానికి కారణాలు ఏంటనేది తెలియలేదు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST