Smoke in Sec-Guntur Intercity Express : సికింద్రాబాద్-గుంటూర్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు - తెలంగాణ తాజా వార్తలు
Smoke in Sec-Guntur Intercity Express :సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళుతున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వ్యాపించాయి. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ వద్దకు రాగానే రైలు నుంచి దట్టమైన పొగలు రావడాన్ని ప్రయాణికులు గమనించారు. అప్పటికే ట్రైన్.. స్టేషన్ వద్ద నిలిపి ఉంచడంతో భయంతో ట్రైన్ నుంచి బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే వచ్చి సమస్యను గుర్తించారు. ట్రైన్లో పొగలు రావడానికి ప్రధాన కారణం బ్రేక్ వద్ద పైపులను తెలిపారు. వెంటనే వాటిని సరి చేసి ట్రైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఇటీవల జరుగుతున్న వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత నెలలో యాదాద్రి జిల్లాలో ఫలక్‌నుమా ట్రైన్ ప్రమాదంలో దాదాపు ఐదు బోగీలు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే తాజాగా జనగామ జిల్లాలో గుంటూర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది.