గూగుల్ స్మార్ట్ లెన్స్ మాదిరి స్మార్ట్ గ్లాస్.. ఐఐఐటీ విద్యార్థుల ఘనత
Smart glasses designed by IIIT Students: వినోదం, పాఠ్యేతర ఆసక్తుల కోసం క్యాంపస్‌లో విద్యార్థుల నేతృత్వంలోని క్లబ్‌లు కొత్తవి కావు. కానీ క్లబ్‌లోని కొంతమంది సభ్యులు ఇంటర్-కాలేజి టెక్ ఫెస్టివల్‌లో అందరి ప్రశంసలు పొంది బహుమతులు పొందటమే కాకుండా.. ఐఐటి ముంబయిలో జరిగిన టెక్ ఫెస్ట్‌లో రన్నర్ అప్‌గా నిలిచారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలోఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు రిషబ్ అగర్వాల్, ఆదిత్య సెహగల్, తాడిమర్రి దేశిక శ్రీహర్ష, అక్షిత్ గురేజా నలుగురు విద్యార్థులు ఎలక్ట్రానిక్స్ అండ్ రోబోటిక్స్ క్లబ్ సభ్యులు.
డిసెంబరులో ఐఐటి ముంబయిలో జరిగిన ఆటమ్‌బర్గ్ టెక్నాలజీస్ నిర్వహించిన హోమ్ ఆటోమేషన్ ఈవెంట్లో పాల్గొని.. తమ ప్రత్యేక ఆవిష్కరణ స్మార్ట్ గ్లాసస్‌తో రన్నర్ అప్‌గా అవార్డును గెలుచుకున్నారు. గూగుల్ స్మార్ట్ లెన్స్‌ను తలపించే ఈ పరికరం గూగుల్ స్మార్ట్ లెన్స్ చేయలేని పనులు చేస్తుందంటున్నారు. ఇంట్లో ఫ్యాన్లు, లైట్లను ఉపయోగించేందుకు రూపొందించిన ఈ స్మార్ట్ గ్లాసస్ ఐఐటి ముంబయిలో ఎన్నో ప్రశంసలు అందుకుంది. వినూత్న ఆవిష్కరణతో టెక్ ఎంతూసియాస్ట్‌లకు ఆదర్శంగా నిలుస్తున్న యువకులతో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి