ఎన్నికల్లో చిన్నపార్టీల ప్రభావమెంత ప్రధాన పార్టీల గెలుపు రాతను మార్చే అవకాశముందా? - తెలంగాణ ఎన్నికల్లో చిన్న పార్టీల ప్రభావం ఎంత
Published : Nov 4, 2023, 9:21 PM IST
Small Parties Impact on Telangana Elections 2023 : ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న ప్రభావమెంత? ఎన్నికల కోలాహలంలో చాలా విస్తృతంగా చర్చ జరుగుతున్న విషయం ఇది. ఒకవైపు.. వారు సాధించే ఓట్లు ఎన్ని? ప్రధానపార్టీల్లో ఎవరిపై అది ఎలాంటి ప్రభావం చూపనుంది.. అనే ఉత్కంఠ. మరోవైపు పలు చిన్నపార్టీలు పోటీకి దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయం ఎవరికి ప్లస్ కానుంది..? ఎవరికి మైనస్ కానుంది? అనే ఆసక్తి.
తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటు తర్వాత ఎన్నికల్లో మొదటిసారి అందర్నీ ఆకర్షిస్తున్నాయి ఈ పరిణామాలు. ఇదే సమయంలో చాలామంది మేధావులు ఎన్నికల్లో పోటీ నుంచి ఎందుకు దూరం జరిగారు? సీటు ఇస్తే ఇంద్రుడు - చంద్రుడు అని పొగడడం, జాబితాలో పేరు లేకుంటే అప్పటికప్పుడు సొంతపార్టీని దూషించడం ఈ రాజకీయ సంస్కృతి ఇంకా ఎన్నాళ్లు? ఒకప్పుడు ప్రభుత్వాల్నే శాసించే స్థితిలో ఉన్న వామపక్షాలు ఈ ఎన్నికల్లో పోషించే పాత్రపై స్పష్టత వచ్చేది ఎప్పటికి? ఇవే అంశాలపై నేటి ప్రతిధ్వని.