ఎంత ట్రై చేసినా నిద్ర పట్టడం లేదా? ఇలా చేస్తే సెట్! - నిద్ర సమస్యలు పరిష్కారాలు
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అవసరం. నిద్ర మనల్ని శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే కంటినిండా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కనీసం రోజుకు ఏడు గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవాలని సూచిస్తున్నారు. సరిగా నిద్ర పోనివారు.. దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో చిన్నా పెద్ద తేడా లేకుండా చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని నియమాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకునేలా కొన్ని పద్దతులను అనుసరించాలని తెలుపుతున్నారు. నిద్రపోయే గది విషయంలోనూ, రోజువారీ ఆహారం, అలవాట్లలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు.
చిన్న పిల్లల విషయంలో ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. నిద్ర సరిగ్గా పోనట్లయితే బీపీ, షుగర్, ఊబకాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. మంచి నిద్ర కావాలంటే వ్యాయామాలు, యోగా చేయాలంటున్నారు. నిద్రకు ఉపక్రమించే ముందు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వాడకంలోనూ.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
నిద్రపోకపోతే మెదడుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, ఆలోచన శక్తి మందగించడం వంటివి జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. మద్యం అలవాటు ఉన్నవారు.. పడుకునే మూడు గంటల ముందు ఎలాంటి ఆల్కహాల్‌ను తీసుకోవద్దని సూచిస్తున్నారు. వృద్దులు, మహిళలు, చిన్న పిల్లలు నిద్రపట్ల కచ్చితంగా శ్రద్ద తీసుకోవాలంటున్నారు. ఆరోగ్య నిపుణులు చెప్పిన పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.