Sister Ties Rakhi with Legs to Brother : అనుబంధం ముందు చిన్నబోయిన వైకల్యం.. చేతులు లేకున్నా అన్నకు రాఖీ కట్టిన చెల్లి
Published : Aug 31, 2023, 9:22 PM IST
Sister Ties Rakhi with Legs to Brother in Zaheerabad : ఆప్యాయతలు, అనురాగాలకు వైకల్యం అడ్డురాదని నిరూపితమైంది. పుట్టుకతో చేతులు లేకున్నా.. అన్నకు కాళ్లతో రాఖీ(Rakhi Festival) కట్టి ఆత్మీయత పంచుకుంది ఆ చిన్నారి చెల్లి. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం హస్నాబాద్కు చెందిన దుర్గయ్య, కల్పన దంపతులు జహీరాబాద్ పట్టణంలోని స్థానిక దస్తగిరి కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ప్రశాంత్, తనుశ్రీ ఇరువురు సంతానం ఉన్నారు.
Rakhi Festival Celebrations in Sangareddy : ఆరేళ్ల తనుశ్రీకి పుట్టుకతో చేతులు లేవు. రాఖీ పండుగ రోజున అన్నయ్య ప్రశాంత్కు కాళ్లతో రాఖీ కట్టి.. మిఠాయి తినిపించింది. తనుశ్రీ చేతులు లేకుండా అన్నయ్యపై ఆత్మీయత పంచుతూ.. రాఖీ కట్టడంతో తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. ఒకటో తరగతి చదువుతున్న తనుశ్రీ క్లాస్ వర్క్, హోంవర్క్ స్వయంగా చేస్తూ చదువులోనూ చక్కగా ప్రతిభ కనబరుస్తున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. తమ చిట్టి తల్లికి చేతులు లేవని ఏనాడూ కుంగిపోలేదని.. తనను ఆత్మవిశ్వాసంతో పెంచుతున్నట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు.