SI Video Viral in Rajanna Sircilla : మద్యం బాటిల్‌తో ఎస్సై వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ - రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా వార్తలు
SI Drunken Video Viral in Rajanna Sircilla district : మద్యం బాటిల్‌తో సామాజిక మాధ్యమాలకెక్కిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ ఎస్సై వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మొన్న చనిపోతానంటూ ఓ వీడియోను విడుదల చేసిన ఎస్సై బోయిని పరుశురాములు.. నిన్న ఏకంగా మద్యం తాగుతూ.. బాటిల్‌తో ఓ వీడియో విడుదల చేశారు. ఇష్టారీతిన మాట్లాడుతూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేయడంతో.. పరుశురామ్ తోటి సిబ్బంది నివ్వెరపోతున్నారు. పరుశురామ్ ప్రస్తుతం సిరిసిల్ల సీసీఎస్‌లో పనిచేస్తున్నారు. గతంలో కోనరావుపేటలో దురుసుగా వ్యవహరించి సస్పెన్షన్‌కు కూడా గురైన ఎస్సై పరుశురామ్ సోషల్ మీడియా వీడియోస్ పై ఇప్పుడు ఉన్నతాధికారుల సీరియస్‌గా దృష్టి సారించారు. అయితే అతని మానసిక పరిస్థితి బాగా లేకపోవడం వల్లే.. ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడనే మరో వాదన వినిపిస్తోంది. ఎస్సై పరశురామ్ స్టేటస్‌గా పెట్టుకున్న వీడియోలు వైరల్‌గా మారడంతో.. ఈ విషయం ఎస్పీ అఖిల్ మహాజన్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది.