5,16,108 రుద్రాక్షలతో శివలింగం తయారీ.. వారి కోసమేనట! - రుద్రాక్షలతో శివలింగం తయారి
కర్ణాటకలోని మైసూర్లో 5,16,108 రుద్రాక్షలతో 21 అడుగుల శివలింగాన్ని తయారు చేశారు. బ్రహ్మ కుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో ఈ శివలింగ ప్రతిమను ఏర్పాటు చేశారు. శివలింగం చుట్టు కృతిమ కైలాస పర్వతాన్ని కూడా నిర్మించారు. శివరాత్రి సందర్భంగా ప్రతిమను తయారు చేసినట్లు నిర్వహకులు బీకే రంగనాథ్ తెలిపారు. శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులందరికీ అవకాశం కల్పిసున్నట్లు రంగనాథ్ వెల్లడించారు. ఎవరైతే హిమాలయాలు, కాశీ, కేదారినాథ్ వెళ్లలేకపోతారో వారి కోసమే ఈ శివలింగాన్ని తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 22 వరకు ఉచితంగానే భక్తులు దర్శనం చేసుకోవచ్చని రంగనాథ్ తెలిపారు. కాగా 50 మంది కార్మికులు.. వారం రోజుల పాటు శ్రమించి రుద్రాక్ష శివలింగాన్ని రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.