Sharwanand Couple in Tirumala: తిరుమలలో శర్వానంద్ దంపతులు.. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు - supreme court and high court judges in Tirumala
Hero Sharwanand Couple in Tirumala: తిరుమల శ్రీవారి అభిషేక సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. టాలీవుడ్ హీరో శర్వానంద్ తన సతీమణితో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం శ్రీవారి అభిషేకం సేవలో శర్వానంద్ దంపతులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో నూతన దంపతులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మరోవైపు తిరుమల శ్రీవారిని పలువురు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. ఇవాళ స్వామివారి అభిషేక సేవలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ.వి.శేష సాయి, జస్టిస్ రవినాథ్ లు పాల్గొన్నారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న వీరికి.. రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం ఛైర్మన్ సుబ్బారెడ్డి శ్రీవారి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్ర పటాన్ని అందజేశారు.