YS Sharmila: 'రైతులను ఏ విధంగా ఆదుకుంటారో కేసీఆర్ చెప్పాలి'
Sharmila Fires on CM KCR: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా ఆదుకుంటారో చెప్పాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపూర్‌కు వెళ్లిన షర్మిల.. పంట నష్టాన్ని పరిశీలించారు. ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగిందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేతికొచ్చిన వరి పంట పూర్తిగా నేల పాలయ్యిందని షర్మిల ఎదుట కర్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం నాగిరెడ్డిపల్లి వెళ్లిన షర్మిల.. అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టం గురించి అన్నదాతలను అడిగి తెలుసుకున్న ఆమె.. రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సాయంత్రం 4 గంటలకు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యవారిపల్లె గ్రామంలో పర్యటించనున్న షర్మిల.. క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడనున్నారు. రాత్రి ఈర్లపుడిలో బస చేయనున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు.. రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మధ్య కురిసిన అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే.
TAGGED:
తెలంగాణ తాజా వార్తలు