తెలంగాణ

telangana

Shamirpet Bus Accident Today

ETV Bharat / videos

Shamirpet Bus Accident Today : బైక్​ ఢీ కొనడంతో బస్సు దగ్ధం.. యువకుడు మృతి - బస్సును ఢీకొన్న బైక్

By

Published : Aug 22, 2023, 1:51 PM IST

Shamirpet Bus Accident Today :బస్సును బైక్ ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ మండలం జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం దామరకుంట వరదరాజుపురం గ్రామానికి చెందిన సంపత్(26) అనే యువకుడు యూజె ఫార్ములా కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈరోజు ఉదయం సుమారు 5:30 నుంచి 6 గంటల ప్రాంతంలో డ్యూటీ నిమిత్తం బైక్​పై వెళ్తుండగా.. కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రధాన రహదారిపై తుర్కపల్లి నుంచి ఎదురుగా వస్తున్న కర్కపట్ల ఫార్మా కంపెనీ బస్సు ఢీ కొట్టింది. 

Bus Accident Shamirpet :ఈ ఘటనలో సంపత్ కుమార్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఆపై బైక్‌ పెట్రోల్‌ ట్యాంక్‌ లీకైంది. బైక్​ నుంచి మంటలు చెలరేగి బస్సుకు అంటుకున్నాయి. దీంతో బైక్‌తో పాటు బస్సు కూడా పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదాన్ని గుర్తించి బస్సులోని ప్రయాణికులు కిందకు దిగారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆదుపులోకి తెచ్చారు. అప్పటికే బస్సు పూర్తిగా తగులబడి పోయింది.

ABOUT THE AUTHOR

...view details