అయోధ్యకు చేరుకున్న సాలగ్రామ శిలల.. రాముడి విగ్రహం తయారీకి నేపాల్ ప్రభుత్వం కానుక
అయోధ్యకు చేరుకున్న సాలగ్రామ శిలలకు భక్తుల ఘన స్వాగతం - Viral videos
ఉత్తర్ప్రదేశ్లో రామ మందిర నిర్మాణానికి నేపాల్ ప్రభుత్వం కానుకగా ఇచ్చిన సాలగ్రామ శిలలు.. అయోధ్యకు చేరుకున్నాయి. నేపాన్లోని జనక్పుర్ నుంచి వచ్చిన ఈ శిలలు.. బుధవారం రాత్రి అయోధ్య నగరానికి చేరాయి. ఈ రాళ్లతో రాముడి విగ్రహం తయారీకి ప్రణాళికలు రూపొందిస్తున్నారు నిర్వహకులు. సాలగ్రామ్ రాళ్ల రాక సందర్భంగా భక్తులు బాణసంచా కాల్చి ఘనంగా స్వాగతం పలికారు. దీంతో అయోధ్య నగరవీధులు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిపోగాయి.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST