Senior IFS Madhusudhana Reddy on Operation Chirutha: 'భక్తుల కోసం ఎలివేటెడ్ ఫుట్‌పాత్.. జంతువులు నడకదారి దాటేందుకు ఓవర్‌పాస్..!' - Senior IFS Madhusudhana Reddy news
Published : Sep 12, 2023, 9:44 PM IST
Senior IFS Madhusudhana Reddy on Cheetahs: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి.. సెప్టెంబర్ 12, 2023న అలిపిరి రోడ్డులో లక్షిత(6) అనే చిన్నారి చిరుత దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. చిన్నారి లక్షిత మృతితో అప్రమత్తమైన ఏపీ అటవీశాఖ అధికారులు.. ఆ చిరుత ఆచూకీ కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో చిన్నారి లక్షితపై దాడి చేసి చంపిన చిరుతను కనుగొనే వరకు కాలిబాట అటవీ ప్రాంతంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని.. రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సీనియర్ ఐఎఫ్‌ఎస్ మధుసూధన రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక అన్నమయ్య భవనంలో జిల్లా, తితిదే అటవీ శాఖ ముఖ్య అధికారులతో భక్తుల రక్షణ, వన్య ప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారు.
Senior IFS Madhusudhana Reddy Comments:సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..''అలిపిరి నడక మార్గంలో భక్తుల కోసం ఎలివేటెడ్ పుట్ పాత్‌తో పాటు జంతువులు అటవీ మార్గంలో నడకదారిని దాటేందుకు ఓవర్ పాస్ నిర్మాణానికి రూపకల్పన చేశాం. అందుకు సంబంధించి.. సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తాం. కాలిబాటలో జరిగిన రెండు సంఘటనలు చాలా బాధాకరం. ఆ రెండు సంఘటనల వల్ల నేనే స్వయంగా నడకదారిలోని పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చాను. అలిపిరి కాలిబాటలో అటు ఇటూ వెళ్లేందుకు అనిమల్ ఓవర్ పాస్ నిర్మాణంపైన ఘాట్ రోడ్డుల్లో క్షుణ్ణంగా పరశీలించేందుకు వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డబ్ల్యూడబ్ల్యూఎఫ్, హైదరాబాద్‌కు చెందిన ఐటీ కోర్ సంస్థ, తితిదే అటవీ శాఖ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశాం. కాలిబాటలో దుకాణదారులు అమ్మే పండ్లు, ఇతర తిండు బండారాలు భక్తులు వేయడం వల్ల.. వాటిని తినేందుకు వచ్చే ఇతర జంతువుల కోసం చిరుతలు వస్తున్నాయి. శేషాచల అడవులు చిరుతలకు అనువైన ప్రాంతం" అని ఆయన అన్నారు.