తెలంగాణ

telangana

Selfie Suicide Video

ETV Bharat / videos

Selfie Suicide Video : కుటుంబ కలహాలతో ఓ యువకుడు.. సెల్ఫీ తీసుకుని మరీ ఆత్మహత్య! - ఆత్మహత్య న్యూస్​

By

Published : Aug 4, 2023, 4:27 PM IST

kamareddy Selfie Suicide Video : కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలో చోటుచేసుకుంది. బాగిర్తిపల్లి గ్రామానికి చెందిన మామిడి హరిబాబు (27) తన పొలం వద్దకు వెళ్లి.. చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చిన్నాన్న కుమారుడైన దుర్గా శైలం సెల్​ఫోన్​కు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి పంపాడు. అందులో తన ఆత్మహత్యకు కారణం గ్రామానికి చెందిన మంద నవీన్, తన అత్త పిట్ట లక్ష్మి, తన భార్య నవనీత కారణమని వీడియోలో పేర్కొన్నాడు. వీడియో చూసిన సోదరుడు శైలం విషయాన్ని హరిబాబు కుటుంబీకులకు చెప్పాడు. కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా అక్కడ ఉన్న చెట్టుకు హరిబాబు వేలాడుతూ కనిపించాడు. వెంటనే తనని చికిత్సా నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details