తెలంగాణ

telangana

అక్రమ నిర్మాణం కూల్చివేతలో ఉద్రిక్తత

ETV Bharat / videos

అక్రమ నిర్మాణం కూల్చివేతలో ఉద్రిక్తత.. ఇద్దరు వ్యక్తులు ఒంటికి నిప్పు.. పోలీసులపై రాళ్ల దాడి - బిహార్​లో పట్నాలో అక్రమ దుకాణం కూల్చివేత ఘటన

By

Published : Feb 17, 2023, 10:19 AM IST

బిహార్​ పట్నా అక్రమ నిర్మాణం కూల్చివేతలో ఉద్రిక్తత నెలకొంది. అలంగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహదీగంజ్ గుమ్టి సమీపంలోని అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు రైల్వే పోలీసులు సిద్ధమయ్యారు. అయితే పోలీసులు దుకాణాన్ని ఖాళీ చేయటం ప్రారంభించిన క్రమంలో స్థానికులు వారిని అడ్డుకున్నారు. ఇద్దరు వ్యక్తులు ఒంటిపై నిప్పంటించుకున్నారు. వెంటనే వారిద్దరినీ సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 

దీంతో స్థానిక దుకాణాదారులు నిరసనకు దిగారు. అంతకు ముందు దుకాణాదారులు, స్థానిక ప్రజలు అందరూ శాంతియుతంగా నిరసన చేపట్టారు. రైల్వే పోలీసులు దుకాణంలోకి ప్రవేశించి.. జేసీబీతో షాప్​ను కూల్చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో జేసీబీ, పోలీసులపై రాళ్లు విసిరి దాడి చేశారు దుకాణాదారులు.  

ABOUT THE AUTHOR

...view details