Sejal Campaign Against MLA Durgam Chinnayya : శేజల్ ప్రచారంతో ఉద్రిక్తంగా మారిన బెల్లంపల్లి - దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా శేజల్ ప్రచారం
Published : Sep 1, 2023, 5:07 PM IST
Sejal Campaign Against MLA Durgam Chinnayya : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా శేజల్ ప్రచారం చేయడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. బెల్లంపల్లికి శేజల్ చేరుకుని బజారు ఏరియాలోని దుకాణాలు వద్ద తిరుగుతుండగా బీఆర్ఎస్ నాయకులు ఆమెను అడ్డగించారు. ఈ క్రమంలో శేజల్‌కు బీజేపీ, కాంగ్రెస్‌లు మద్దతు తెలిపారు. ఒక్కసారిగా అక్కడకు చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు శేజల్పై దాడికి యత్నించడంతో ఆమె భయంతో పరుగులు తీసింది. ఈ క్రమంలో ఆయాపార్టీల నాయకులు పరస్పర విమర్శలు చేసుకున్నారు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు శేజల్‌ను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోడి రమేశ్ ఇంటిని బీఆర్ఎస్ నాయకులు ముట్టడించారు. దీంతో మరోసారి అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా కాంగ్రెస్ బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. మొత్తంమీద శేజల్ వ్యవహారంతో ఇవాళ బెల్లంపల్లిలో కాసేపు ఉద్రిక్త వాతావరణం కనిపించింది.