ప్రజల సమస్యలను పరిష్కారించడానికే ప్రజాపాలన చేపట్టాం : సీతక్క - ప్రజాపాలనలో సీతక్క
Published : Dec 30, 2023, 1:01 PM IST
Seethakka In Prajapalana Program At Mulugu : ములుగు జిల్లా ములుగు మండలం బండారుపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీలో ప్రజా పాలన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క హాజరయ్యారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఆరు పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అన్నారు. ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారుల వద్దకు రాకుండా వారే పల్లెలకు, గూడెంలకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని మంత్రి సీతక్క అన్నారు.
Revanth Reddy Started Prajapalana Program : రేషన్ కార్డు లేని వారు కూడా మహాలక్ష్మి పథకానికి అర్హులవుతారని మంత్రి చెప్పారు. జనవరి 6తో ఈ కార్యక్రమం ముగిసిన, మళ్లీ నాలుగు నెలల తర్వాత కూడా ప్రజా పాలన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇప్పుడు లబ్ధి పొందని వారు అప్పుడు పొందవచ్చని మంత్రి సీతక్క తెలిపారు. ప్రజాపాలన అప్లికేషన్లు మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలో ఇవ్వొచ్చని సీతక్క అన్నారు.