గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క - ములుగులో సంబురాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు - Mulugu latest news
Published : Dec 7, 2023, 9:36 PM IST
Seethakka Becomes Minister Congress Activists Celebrate in Mulugu :ములుగు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క. ఈనెల మూడవ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల లెక్కింపులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతిపై అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించింది. భారీ మెజార్టీతో సాధించి ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యే సీతక్కకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మంత్రి పదవిని ఇచ్చారు. నేడు ఎల్బీ స్టేడియంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
Seethakka MLA, Celebrations In Mulugu :అనంతరం 10 మంది మంత్రి పదవులతో పాటు ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అనసూయ సీతక్క మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో జిల్లా కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. సీతక్క గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మహమ్మద్ అహ్మద్ పాషా తదితరులు పాల్గొని టపాసులు కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు.