తెలంగాణ

telangana

Baby Shower for Cow in Annamayya District

ETV Bharat / videos

Seemantham Performed for Cow in Annamayya District: కుమార్తెలా ఆవు.. సీమంతం చేసి సంబరం - Seemantham To Pregnant Cow

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2023, 10:46 PM IST

Updated : Sep 4, 2023, 9:03 AM IST

Seemantham Performed for Cow in Annamayya District: మహిళలకు మాత్రమే సీమంతం చేయడం మనం చూస్తూ ఉంటాం. అయితే తన సొంత కుమార్తెలా చూసుకున్న పాడి ఆవుకు సీమంతం చేసి పశువులపై తనకున్న ప్రేమను చాటి చెప్పారు ఆ మహిళ. గ్రామంలోని మహిళల సహకారంతో పాడి ఆవుకు సీమంతం చేశారు. ఈ అరుదైన సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం ఇసుకనూతుపల్లిలో జరిగింది. ఈ గ్రామంలో నివాసముంటున్న ఉమాదేవి పశు పోషణ ఆధారంగా జీవిస్తున్నారు. ఇందులో వచ్చే ఆదాయంతోనే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని ముగ్గురు పిల్లల వివాహం సైతం చేశారు. 

భర్త 21 సంవత్సరాల క్రితం మరణించాడు.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఉమాదేవికి తన అల్లుడు ఒక ఆవును ఇచ్చాడు. దీంతో ఆమె పశుపోషణకే ప్రాధాన్యమిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ప్రస్తుతం తన దగ్గర ఉన్న లక్ష్మి అనే ఆవు గర్భం దాల్చింది. ఆమె ఆవుకు గ్రామంలోని మహిళల సాయంతో సీమంతం నిర్వహించారు. స్థానిక మహిళలతో కలిసి ఆవును అందంగా అలంకరించి.. పాటల పాడి ఆనందంగా సీమంతం వేడుకలు నిర్వహించారు.  కుమార్తెగా భావించే లక్ష్మి ఆవుకు సీమంతం చేయడం చాలా సంతోషంగా ఉందని ఉమాదేవి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Last Updated : Sep 4, 2023, 9:03 AM IST

ABOUT THE AUTHOR

...view details