Seelam Janaki Bai Pond in Nizamabad : జలకళతో కనువిందు చేస్తున్న శీలం జానకి బాయి చెరువు - Seelam Janaki Bai Pond in indalwai
Seelam Janaki Bai Lake in Nizamabad : గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు వల్ల చెరువులు, కాలవలు, వాగులు నీటితో నిండి పొంగి పొర్లతున్నాయి. బోసిపోయిన చెరువులను చూసిన స్థానికులు నీటితో నిండు కుండలా మారి జలపాతంలా నీరు పారుతుంది. దీంతో ఆనందంగా ప్రజలు ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూసేందుకు వెళుతున్నారు. అలానే నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్ణపల్లి గ్రామంలోని స్థానికులను కనువిందు చేస్తుంది శీలం జానకి బాయి చెరువు. నీరు జలపాతంలో పారుతున్నందున.. ప్రజలు చెరువును చూస్తూ.. ఆనందోత్సవంలో తేలుతున్నారు. మరికొందరూ సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. ఎక్కువగా నీరు రావడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. చెరువు వీలైనంత దూరం నుంచే వీక్షించాలని.. వర్షాలు కురుస్తున్నందున పరిసర ప్రాంతాలు గుంటలు పడే అవకాశం ఎక్కువగా ఉన్నదని సూచనలు ఇస్తున్నారు. అయితే ఈ వర్షాలు తగ్గాక ఈ చెరువు చూపరులను మరింతగా ఆకట్టుకోనున్నదని స్థానికులు అంటున్నారు.