తెలంగాణ

telangana

Railway Police arrested Maharastra thieves

ETV Bharat / videos

Secunderabad Railway Police Arrested to Chain Robbers : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​ సీసీ ఫుటేజీ నిఘాతో​.. రైల్వే పోలీసులకు చిక్కిన దొంగల ముఠా - టుడే తెలంగాణ వార్తలు

By

Published : Aug 4, 2023, 10:39 PM IST

Secunderabad Railway Police Arrested Thieves through CCTV Footage : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో మహిళలను లక్ష్యంగా పెట్టుకొని.. గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను రైల్వే పోలీసులు అరెస్ట్​ చేశారు. ముఠాలో గల ఐదుగురు సభ్యులు మహారాష్ట్రకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఐదు మందిని రిమాండ్​కు తరలించారు. నిందితులంతా మహారాష్ట్రలోని బీడ్ ప్రాంతానికి చెందిన ముఠాగా రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే స్టేషన్​కి వచ్చే అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని వారి దృష్టి మరల్చి మంగళ సూత్రాలను అపహరిస్తున్నట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లో అమాయకంగా ఆదమర్చి ఉన్న మహిళ ప్రయాణికులను టార్గెట్గా చేసుకొని.. ముసుగులు ధరించి ప్రణాళిక ప్రకారం చెరో ఇద్దరు మహిళకు ముందు, వెనుకన చేరి వారిని అయోమయానికి గురిచేసి దొంగతనానికి పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలలో చిక్కటంతో నిందితులను గుర్తించి పట్టుకున్నట్లు రైల్వే పోలీసు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details