తెలంగాణ

telangana

Scorpion Festival in Narayanpet

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2023, 5:21 PM IST

ETV Bharat / videos

Scorpion Festival Video : అక్కడ ప్రతి రాయి కింద తేలు.. ముట్టినా కుట్టదు.. ఎందుకో తెలుసా..?

Scorpion Festival Video in Yadgir Karnataka :శ్రావణమాసంలో నిర్వహించుకునే నాగుల పంచమి గురించి అందరికీ తెలుసు.. అన్ని ప్రాంతాల్లో నాగుల పంచమి రోజున మహిళలు నాగదేవతల విగ్రహాలకు పాలు పోసి ప్రత్యేక పూజలను చేస్తారు. కానీ కర్ణాటక-తెలంగాణ సరిహద్దులో ఉన్న ఓ గ్రామంలో కొండమవ్వ గుట్టపై (Scorpion Festival) వెలసిన తేళ్ల విగ్రహాలకు పూజలు చేసి దర్శించుకునేందుకు ప్రజలు బారులు తీరుతారు. అక్కడే మరో ప్రత్యేకత ఉంది. ఆ గుట్టపై ఏ రాయిని కదిలించినా తేలు కనిపిస్తుంది. వాటిని ముట్టుకున్నా కూడా అవి కుట్టవట. అయితే పంచమి రోజున మాత్రమే ఇవి దర్శనమిస్తాయని గ్రామస్థులు చెబుతున్నారు.

Scorpion Festival in Narayanpet : తెలంగాణ-కర్ణాటకలోని యద్గిర్ జిల్లాలో ఉన్న కందుకూరు గ్రామంలో ప్రత్యేకమైన ఆచారం కొనసాగుతోంది. శ్రావణ మాసంలో నాగుల చవితికి అందరూ పాము విగ్రహాలకు పూజలు చేస్తే.. ఇక్కడ మాత్రం తేళ్లను పూజించి మొక్కులు తీర్చుకుంటారు ఈ గ్రామస్థులు. ఏటా శ్రావణ మాసంలో కందుకూరు గ్రామానికి ఆనుకోని ఉన్న కొండమవ్వ గుట్టపై ఉన్న గుడిలో తేళ్ల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు.

ఈ గుట్టపై ఉన్న రాళ్లను కదిపితే తేళ్లు కనిపిస్తాయని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు తేళ్లను చేత్తో పట్టుకొని ఆడుకుంటారు. వీటిని తమ చేతులపై, కళ్లు, తల, నాలుకపై వేసుకుంటారు. ఈ సమయంలో భక్తులకు ఇవి ఏమాత్రం హాని చేయవు. ఒకవేళ తేలు కుడితే ఆలయ పూజారి.. విగ్రహాలకు అంటించిన పసుపు కుంకుమను పూస్తారు. దాంతో బాధితులకు నొప్పి పోతుంది. ఈ వింత ఆచారాన్ని చూడడానికి కర్ణాటక రాష్ట్రంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి భక్తులు తరలివస్తుంటారు.

ABOUT THE AUTHOR

...view details