బస్టాండ్‌లోనే విద్యార్థినుల ఫైట్.. జుట్టు పట్టుకుని పిడిగుద్దులు - పాఠశాల విద్యార్థుల గొడవ
students fighting: పాఠశాల విద్యార్థినుల మధ్య వాగ్వాదం పెద్ద గొడవకు దారితీసింది. బస్టాండ్‌లోనే విద్యార్థినులు జుట్టు పట్టుకుని పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ సంఘటన తమిళనాడు, మధురైలోని పెరియార్ బస్టాండ్‌లో శనివారం సాయంత్రం 4 గంటలకు జరిగింది. పాఠశాల నుంచి ఇళ్లకు వెళ్లే క్రమంలో బస్టాండ్‌కు చేరుకున్నారు విద్యార్థులు. ఈ క్రమంలోనే రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త కొట్టుకునే వరకు వెళ్లింది. రెండు గ్రూప్‌ల మధ్య గత మూడు రోజులుగా గొడవ జరుగుతున్నట్లు సమాచారం. బస్టాండ్‌లో ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST