తెలంగాణ

telangana

SBI

ETV Bharat / videos

SBI Donation Rs 50000 Groceries To Orphanage : అనాథ ఆశ్రమానికి.. ఎస్‌బీఐ ఉద్యోగుల చేయూత - rangareddy news

By

Published : Jun 21, 2023, 10:27 PM IST

SBI Donation Rs 50000 For Essentials To Orphanage : రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలోని శాంతినికేతన్ అనాథ ఆశ్రమంలో ఉన్న అనాథలకు ఎస్‌బీఐ ఉద్యోగులు చేయూతను అందించారు. యూనియన్ నాయకుడు కామ్రేడ్ తారక్ వర్ధంతి సందర్భంగా యూనియన్ డే గా ప్రకటించి గత 19 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

ఎస్‌బీఐ స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో శాంతినికేతన్ అనాథ ఆశ్రమంలో ఉన్న అనాథలకు రూ.50 వేలు విలువైన నిత్యావసర సరుకులను, వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్‌బీఐ స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్ కమిటీ జనరల్ సెక్రటరీ శ్రీరామ్ హాజరయ్యారు. ఇప్పటివరకు తాము రూ.75 లక్షల వరకు ఇలా సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నామని జనరల్‌ సెక్రటరీ వివరించారు. ఇలా సేవ చేయడాన్ని అందరం ఎంతో ఆనందంగా భావిస్తామని.. వారి కళ్లలో చిరునవ్వును చూడాలనుకుంటామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో చాలా చోట్ల ఇలా సహాయం చేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details