తెలంగాణ

telangana

కార్తీకమాసం సందర్భంగా యాదాద్రిలో సత్యనారాాయణస్వామి వత్రాలు

ETV Bharat / videos

కార్తికమాసం స్పెషల్ - ఈనెల 14 నుంచి యాదాద్రిలో సత్యనారాయణస్వామి వత్రాలు - karthika masam

By ETV Bharat Telangana Team

Published : Nov 7, 2023, 2:57 PM IST

Satyanarayana Vratam at Yadadri Temple : యాదాద్రి పుణ్యక్షేత్రంలో కార్తికమాసం సందర్భంగా ఈనెల 14 నుంచి డిసెంబర్ 12 వరకు శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలను నిర్వహించనున్నారు. నిత్యం ఆరు దఫాలుగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. అత్యంత విశేషమైన కార్తికమాసంలో సత్యనారాయణస్వామి వ్రతాలను భక్తులు ఎంతో శ్రద్ధగా నిర్వహించుకుంటారని చెప్పారు. కుటుంబ సంక్షేమానికై ఈ వ్రత ఆచరణ పట్ల ఆసక్తి వహించే భక్తజనుల కోసం ఈ క్షేత్రంలో నెల రోజులపాటు రోజుకు ఆరు దఫాలుగా వ్రతాలు జరపనున్నట్లు వెల్లడించారు.

ప్రతి రోజు ఉదయం 6:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ప్రతి రెండు గంటలకు ఒకసారి ఈ వ్రతాన్ని నిర్వహించనున్నట్లు ఈవో గీత తెలిపారు. ఈ మేరకు కొండ కింద నిర్మితమైన మండపంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ చెప్పారు. ఈనెల 27న కార్తిక శుద్ధ పౌర్ణమి రోజు (సోమవారం) ఉదయం 5:30 నుంచి రాత్రి 7 గంటల వరకు ఎనిమిది దఫాలుగా వ్రతాల నిర్వహణ కొనసాగుతుందని వెల్లడించారు. యాదాద్రికి అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్టలో ఈనెల 14వ తేదీ నుంచి డిసెంబర్ 12 వరకు నిత్యం ఐదు సార్లు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించనున్నట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details