తెలంగాణ

telangana

Sathupalli BRS Candidate Sandra venkata Veeraiah Interview

ETV Bharat / videos

దళిత బంధు గురించి ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి లేదు : సండ్ర వెంటకవీరయ్య - తెలంగాణ అభివృద్ధిపై సండ్ర వెంటకవీరయ్య వ్యాఖ్యలు

By ETV Bharat Telangana Team

Published : Nov 18, 2023, 1:40 PM IST

Sathupalli BRS Candidate Sandra venkata Veeraiah Interview :ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్​ ప్రచారం జోరందుకుంది. ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో వెళ్తున్న అభ్యర్థులు.. తాము అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారో వివరిస్తున్నారు. మరోసారి అధికారమే లక్ష్యంగా సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్​ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఇంటింటికి వెళ్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సత్తుపల్లి గడ్డపై వరుసగా నాలుగోసారి విజయకేతనం ఎగురవేస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో మందుకు తీసుకెళ్తున్నానని స్పష్టం చేశారు. 

గత 15 ఏళ్లుగా సత్తుపల్లిలో తాను చేసిన అభివృద్ధే తనని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇది వరకు సత్తుపల్లిలో మట్టిరోడ్లు ఉండేవని.. సీఎం కేసీఆర్​ హయాంలో సీసీ రోడ్లు వేశామని తెలిపారు. దళిత బంధు విషయంలో తనపై వచ్చిన ఆరోపణలు ఖండించారు. ఈ పథకం విషయంలో ప్రశ్నించే హక్కు కూడా కాంగ్రెస్​కు లేదని మండిపడ్డారు. ప్రజల ఆశీర్వాదంతో నాలుగో సారి విజయఢంకా మోగిస్తానంటున్న సండ్ర వెంకటవీరయ్యతో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details