తెలంగాణ

telangana

Hyderabad Apsara Murder Case Updates

ETV Bharat / videos

Hyderabad Apsara Marriage Photos Viral : 'అప్సరకు పెళ్లయిందా.. లేదా.. అనేది అనవసరం' - Apsara Mother About Her Daughter Marriage

By

Published : Jun 11, 2023, 2:17 PM IST

Apsara Mother About Her Daughter Marriage  :రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సరూర్​నగర్ అప్సర హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ విషయంపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి చేసుకోమని బలవంతం చేసినందుకే అప్సరను హత్య చేసినట్లు నిందితుడు సాయికృష్ణ దర్యాప్తులో అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అయితే తాజాగా.. అప్సరకు గతంలోనే వేరే వ్యక్తితో పెళ్లైనట్లుగా ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్సరకు ఇదివరకే పెళ్లైందన్న విషయంపై స్పందించేందుకు ఆమె తల్లి అరుణ నిరాకరించారు. చనిపోయిన అప్సర గురించి చెడుగా మాట్లాడటం ఎంతవరకు సబాబు అని ఆమె ప్రశ్నించారు. తన కుమార్తె ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారని అరుణ వాపోయారు. ప్రస్తుతం జరిగిన ఘటన మీద దృష్టి పెట్టండని అన్నారు. చివరి వరకు అప్సర తిరిగివస్తుందని భావించానని.. కానీ శవమై తేలిందని కన్నీరు మున్నీరుగా విలపించారు. తన కుమార్తెను చంపిన నిందితుడు సాయికృష్ణను దేవుడే శిక్షిస్తాడని వ్యాఖ్యానించారు. 

ABOUT THE AUTHOR

...view details