తెలంగాణ

telangana

ETV Bharat / videos

సంక్రాంతి పండుగ ఇంకా ఉంది.. పశువుల పండగతో సరదాపడుతున్న యువత.. ఎక్కడంటే? - తిరుపతిలో పశువుల పండుగ

🎬 Watch Now: Feature Video

By

Published : Jan 22, 2023, 10:59 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

jallikattu in tirupati district: ఆంధ్రప్రదేశ్​లో సంక్రాంతి అంటే సంతోషాలకు, ఆనందాలకు నిలయం. పండుగకు వారం రోజుల ముందే పండుగ వాతవరణం మొదలవుతుంది. పండుగ మూడవ రోజున మళ్లీ వచ్చే సంక్రాంతి ఎదురుచూపులు. కానీ అక్కడ మాత్రం పండగ ముగిసి వారం రోజులు అయినా ఇంకా పండుగను చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో సంక్రాంతి పండుగ ముగిసినప్పటికీ పశువుల పండుగ మాత్రం జరుగుతూనే ఉంది. చంద్రగిరి మండలం చిన్నరామాపురం గ్రామపంచాయతీలో ఆదివారం పశువుల పండుగను నిర్వహించారు. చంద్రగిరి మండలంలో పశువులు పండుగ నిర్వహించరాదు అంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. 

పశువులు పండుగ జరిగే ప్రతి గ్రామంలోనూ హెచ్చరిక బోర్డులు ఉంచి ప్రజలను అప్రమత్తం చేశారు. కొన్ని గ్రామాలలో పశువులు పండుగ జరగకుండా పోలీసులు కట్టడి చేశారు. అయితే అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో చంద్రగిరి మండలం చిన్నరామాపురం పంచాయతీలో పశువుల పండుగను గ్రామస్తులు నిర్వహించారు. ఇదే గ్రామపంచాయతీలో రెండు రోజులకు మునుపు పండుగ నిర్వహించరాదు అంటూ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి.. పశువుల పండుగను నిలిపివేశారు. అయితే ఈరోజు బహిరంగంగానే పశువుల పండుగ నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపి పండుగను నిర్వహిస్తున్న పోలీసులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదు.

పశువులను అందంగా అలంకరించి వాటి కొమ్ములకు చెక్క పలకలు, పసుపు టవళ్లు కడతారు. అనంతరం వాటిని పరిగెత్తిస్తారు. అలా పరుగులు తీస్తున్న పశువుల కొమ్ములకు కట్టినవాటిని సొంతం చేసుకునేందుకు.. యువత వాటితో పాటు పరుగులు పెడతారు. అలా పశువుల కొమ్ములకు కట్టినవాటిని సాధించడాన్ని గొప్పగా వారు భావిస్తారు. ఈ క్రమంలో అనేక మందికి గాయాలవుతుంటాయి.

ఇవీ చదవండి:

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details